: మోదీ దగ్గర అలా అంటే... జగన్ సంగతి తేలిపోతుంది: ఆనం వివేకా
వైఎస్సార్సీపీ అధినేత జగన్ రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా 'మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే... నేను ముఖ్యమంత్రినైతే..' అంటూ ఉంటారని టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ, మిర్చి గురించే తెలియని పిల్లోడు జగన్ అని, అలాంటోడు దీక్ష చేయడమేంటని ఆయన అన్నారు. తండ్రి అధికారం అండగా లక్ష కోట్లు దోచేసిన, జగన్ నీతులు చెబుతున్నాడని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి అవుతానని జగన్ పదేపదే ఏపీలో అంటున్నాడు కనుక సరిపోయిందని, ఈ విషయం 56 అంగుళాల ఛాతీ కలిగిన ప్రధాని మోదీ దగ్గర అంటే జగన్ జీవితాంతం జైల్లోనే ఉంటాడని ఆయన తెలిపారు. వైఎస్ ప్రభుత్వంలో అవినీతి ఉందని సర్వేలో తేలిందని ఆయన అన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి మంచి పేరు తెస్తున్నారని ఆయన పేర్కొన్నారు.