: బైక్ ధరలను పెంచిన హీరో మోటార్స్
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్ ధరలను పెంచింది. తాము ఉత్పత్తి చేస్తున్న వివిధ మోడళ్ల బైక్ ధరలను రూ.500 నుంచి రూ.2200 వరకు పెంచినట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. మే 1వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమలవుతాయని వెల్లడించింది. గత నెలలో హీరో బైక్స్ అమ్మకాలు తక్కువగా నమోదయ్యాయి. కేవలం 5,91,306 బైక్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. పోయిన సంవత్సరం ఇదే నెలలో 6,12,739 వాహనాలు అమ్ముడయ్యాయి.