: 'ఈ రాత్రి మాతోనే ఉందువు రా!' అంటూ చెరోచేయి పట్టుకుని సినీ నటిని లాక్కెళ్లిపోయేందుకు ప్రయత్నించిన యువకులు!


కన్నడ వర్ధమాన సినీ నటి (23) పై ఇద్దరు యువకులు దౌర్జన్యానికి పాల్పడ్డ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు రాజగోపాలనగర ఠాణా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సినిమా షూటింగ్ లో పాల్గొని హెగ్గనహళ్లి వద్ద క్యాబ్‌ దిగి ఇంటికి వెళ్తున్న సినీ నటిని సచిన్‌, ప్రవీణ్‌ అలియాస్‌ పుట్ట అడ్డగించారు. ఈ రాత్రికి మాతోనే గడుపుదువుగాని రా...అంటూ ఇద్దరూ చెరో చేతిని పట్టుకుని ఆమెను లాక్కుపోయే ప్రయత్నం చేశారు.

దీనికి ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను దూషిస్తూ, దాడి చేసి పరారయ్యారు. వారిద్దరితో ఆ నటికి మూడేళ్లుగా పరిచయం ఉందని, వారి వేధింపులతో గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేశానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆమె తమకు కొంత డబ్బు బాకీ ఉందని, తాము అడగడంతో తమపై ఆరోపణలు చేస్తోందని వారిద్దరూ చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News