: మూడు రోజుల్లో 'బాహుబలి-2' వసూళ్లు 505 కోట్లు... కారణం ఏమిటి?


'బాహుబలి-2: ద కన్ క్లూజన్' చలన చిత్ర చరిత్రలో ఇంతవరకు సాధ్యం కాని ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అలా సొంతం చేసుకోవడానికి ఆ చిత్ర నిర్మాతలు పక్కా ప్రణాళికతో వ్యవహరించడమే కారణం. 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమాను పక్కా ప్రణాళిక ప్రకారం పబ్లిసిటీ నిర్వహించడానికి తోడు... సినిమా విడుదల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ జాగ్రత్తే 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమాకు బలంగా మారింది. సాధారణంగా సినీ ప్రేక్షకులు వీకెండ్స్ లో బాగా ధియేటర్లకు వెళ్తారు. శని, ఆదివారాలు ఏ సినిమాకైనా వసూళ్లు బాగానే ఉంటాయి. సోమవారం కూడా ఆ సినిమా వసూళ్లు సాధించగలిగితే... ఇక డానికి తిరుగుండదు. 

దీంతో 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' నిర్మాణ సంస్థ ప్లానింగ్ కు వీకెండ్ తో పాటు మేడే కూడా కలిసి వచ్చింది. వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో సినీ ప్రేక్షకులు క్యూట్టారు. వేసవి సెలవులు కావడంతో ఈ సినిమాను చూసేందుకు పిల్లంతా ఆసక్తి చూపగా, యువకులు సినిమాలతోనే రిలాక్స్ అవుతారు కనుక వారు కూడా సినిమాను వీక్షించారు. ఇక వీకెండ్ కావడంతో వేతన జీవులు కూడా 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' ఒడిలోనే సేదదీరారు. దీంతో ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే 505 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి, రికార్డులకెక్కింది. 

మనదేశంలో విడుదలైన అన్ని భాషల్లో కలిపి 385 కోట్ల రూపాయలు వసూలు చేసిన 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా, విదేశాల్లో ఈ మూడు రోజుల్లో 120 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంతే కాకుండా, హిందీలో తొలి మూడు రోజుల్లో 128 కోట్ల రూపాయలు రాబట్టి, గతంలో ‘దంగల్‌’ (107.01 కోట్లు), 'సుల్తాన్‌' (105.53 కోట్లు) రికార్డుల్ని బద్దలు కొట్టింది. దీనిపట్ల రాజమౌళి, శోభు హర్షం వ్యక్తం చేశారు. ఇలాగే ఈ సినిమా నిలకడగా వసూళ్లు సాధిస్తే....1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి భారతీయ సినిమాగా రికార్డులు నెలకొల్పుతుంది. 

  • Loading...

More Telugu News