: ప్రతీకార దాడులు చేసిన భారత ఆర్మీ... రెండు పాక్ పోస్టులు ధ్వంసం


జమ్ముకశ్మీర్ పూంఛ్‌ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్‌ నియంత్రణ రేఖ దాటి వచ్చి మరీ ఇద్దరు భారత జవాన్ల దేహాలను ఖండఖండాలుగా నరికి ఛిద్రం చేసిన పాకిస్థాన్ ఆర్మీపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇండియన్ ఆర్మీ కదిలింది. దీంతో నియంత్రణ రేఖ వెంబడి కృష్ణ ఘాటీ సెక్టార్‌ కు సమీపంలో ఉన్న పాకిస్థాన్‌ కు చెందిన రెండు పోస్టులను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. పింపల్, కిర్‌ పాన్ పోస్టులు ధ్వంసమయ్యాయి. అయితే ఈ ఘటనలో పాకిస్థాన్‌ కు ఎంత నష్టం జరిగిందనే విషయంపై పూర్తి స్పష్టత రాలేదు. కాగా, భారత జవాన్లపై చేసిన దాడులపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎప్పుడూ ప్రతీకార చర్యలకు పాల్పడడం కాకుండా, పాకిస్థాన్ కు బుద్ధి వచ్చేలా చేయాలని యువత నినదిస్తోంది. 

  • Loading...

More Telugu News