: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జూనియర్ ఎన్టీఆర్ దంపతులు
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ దంపతులు నేటి ఉదయం తెల్లవారు జామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించారు. వారితో పాటు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కూడా ఉండడం విశేషం. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, శ్రీవారి కరుణా కటాక్షం ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించాడు. సుప్రభాత సేవలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పాడు.