: దుమారం రేపిన బాలీవుడ్ నటి కాజోల్ వీడియో.. వివరణ ఇచ్చుకున్న వైనం!
బాలీవుడ్ ప్రముఖ నటి కాజోల్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వివాదం రేపుతోంది. స్నేహితుడు రైన్స్ తన రెస్టారెంట్‌లో బీఫ్ వేపుడు సిద్ధం చేశాడంటూ అతడితో కలిసి దిగిన బీఫ్ పార్టీ వీడియోను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టు చేసింది. ప్రస్తుతం దేశంలో బీఫ్‌పై పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతుండగా, మరోవైపు గోవుల రక్షణ ఉద్యమం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన బీఫ్ పార్టీ వీడియో సంచలనం రేపింది.
ఆమె వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వెంటనే వివరణ ఇచ్చింది. తన స్నేహితుడు తయారు చేసింది బీఫ్ కాదని, గేదె మాంసం అని వివరణ ఇచ్చింది. తన స్నేహితుడు బీఫ్ ఉందని చెప్పాడని, కానీ నిజానికి అది గేదె మాంసం అని పేర్కొంది. ఆ మాంసం చట్టబద్ధంగానే అందుబాటులో ఉందని తెలిపింది. మతపరమైన భావాలను దెబ్బ తీసే ఉద్దేశం తనకు లేదని పేర్కొంటూ సోషల్ మీడియా నుంచి తన పోస్టింగ్‌ను తొలగించింది.