: బెంగళూరు గాయనిపై లైంగిక దాడికి యత్నించిన ‘ఓలా’ డ్రైవర్!
బెంగళూరులో ఓ యువ గాయనిపై ఓలా క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటనకు సంబంధించి బొమ్మనహళ్లి పోలీసులు తెలిపిన వివరాలు .. బెంగళూరులో స్థిరపడ్డ ఓ యువ గాయని నిన్న రాత్రి 2.30 గంటల సమయంలో విధులు ముగించుకుని ఓలా క్యాబ్ లో తన ఇంటికి బయలుదేరింది. అయితే, వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో క్యాబ్ వెళ్లడాన్ని ఓలా యాప్ ద్వారా ఆ యువతి గుర్తించింది.
అప్పటికే, క్యాబ్ ఓ నిర్జన ప్రదేశానికి చేరుకోవడంతో డ్రైవర్ తో పెనుగులాడి అతని బారి నుంచి తప్పించుకుంది. సమీపంలో ఉన్న ఓ మెడికల్ క్లినిక్ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి తన స్నేహితుడికి ఫోన్ చేసింది. అయితే, క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అదనపు పోలీస్ కమిషనర్ హేమంత్ నింబాల్కర్ తెలిపారు. కాగా, క్యాబ్ డ్రైవర్ ను విధుల నుంచి తొలగించామని ఓలా సంస్థ ప్రకటించింది.