: ఈ హెల్మెట్ ధర తొమ్మిది కోట్ల రూపాయలు!
జపాన్‌కు చెందిన ‘జింజా తనకా’ జ్యువెల్లర్స్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హెల్మెట్‌ను తయారు చేసి అందరి దృష్టీ తమవైపుకి తిరిగేలా చేసుకుంది. వారు తయారు చేసిన హెల్మెట్ ధర ఎంతో తెలిస్తే వామ్మో అనాల్సిందే. ఈ హెల్మెట్ ధర దాదాపు తొమ్మిది కోట్ల (1.4 మిలియన్ డాలర్లు) రూపాయలు. ఈ హెల్మెట్‌ను 24 క్యారెట్ల బంగారంతో రూపొందించారు. దీని బరువు 14.96 కిలోలు.
ఈ సందర్భంగా ‘జింజా తనకా’ జ్యువెల్లర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ... సార్ట్‌వార్‌స్ సినిమాలోని డార్త్ వాదర్ పాత్ర ధరించే తరహా హెల్మెట్‌ను తయారు చేశామని అన్నారు. ఓ వైపు స్టార్‌వార్స్ సినిమా 40 ఏళ్లు పూర్తిచేసుకోగా, మరోవైపు తమ సంస్థ 125 ఏళ్లు పూర్తిచేసుకుందని చెప్పారు. ఈ సందర్భంగానే తాము ఈ హెల్మెట్‌ను తయారు చేశామని చెప్పారు. ఈ హెల్మెట్ ను ఈ నెల 4న టోక్యోలోని ‘జింజా’ ప్రధాన దుకాణంలో వేలం వేస్తున్నట్లు ఆ సంస్థ సిబ్బంది తెలిపారు.