: మరో ఓటమిని మూటగట్టుకున్న కోహ్లీ టీమ్... బెంగళూరుపై ముంబయి విజయం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాభవాల పరంపరను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోరంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు కాస్త బాగానే ఆడుతోందనిపించినప్పటికీ కోహ్లీసేన చివరకి ఓటమిని మూట గట్టుకోక తప్పలేదు. ఈ రోజు వాంఖడే వేదికగా జరిగిన మ్యాచులో బెంగళూరుపై ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది.
బెంగళూరు తమ ముందు ఉంచిన 163 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి టీమ్ చివరివరకు పోరాడింది. ముంబయి జట్టు స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ (56 పరుగులు) విజృంభించడంతో ఆ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచి నాకౌట్ దశకు మార్గాన్ని సుగమం చేసుకుంది.