: నేనే మొదటి కార్మికుడిని.. ఏదైనా సన్మానం చేయాలంటే నాకే చేయాలి: చంద్రబాబు
ఈ రోజు మే డే సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేనే మొదటి కార్మికుడిని..ఏదైనా సన్మానం చేయాలంటే నాకే చేయాలి మీరందరూ. ఎందుకంటే, రాత్రింబవళ్లు పని చేస్తున్నాను. నిద్రపోయే సమయం తప్పా, మిగిలిన సమయం అంతా, ప్రజల కోసమే పని చేస్తున్నాను. నాకు ఎప్పుడూ అలుపు కూడా లేదు. ఎందుకు అలుపు లేదంటే.. ఇష్టపడి పని చేస్తాను. మీరు కూడా ఇష్టపడి పని చేస్తే .. మీకు కూడా అలుపుండదు .. విసుగుండదు..’ అని చంద్రబాబు అన్నారు.