: బంపర్ ఆఫర్... రూ.148కే 70 జీబీ 4 జీ డేటా
ఉచిత మంత్రంతో టెలికాం మార్కెట్లో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సంచలనమే సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ కూడా ఈ రోజు అటువంటి ఆఫరే ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ కేవలం తెలుగు రాష్ట్రాల యూజర్లకు మాత్రమే కావడం విశేషం. ''సూపర్ వాల్యు'' టారిఫ్ ప్లాన్లో భాగంగా రూ.148తో రీఛార్జ్ చేసుకుంటే 70 జీబీ 4జీ డేటాను అందించనున్నట్టు రిలయన్స్ కమ్యూనికేషన్స్ తెలిపింది. ప్రతీ రోజు 1జీబీ డేటా చొప్పున 70 రోజుల వరకు ఈ డేటా ప్యాక్ అందనున్నట్లు పేర్కొంది.
అంతేకాదు, 50 రూపాయల టాక్ టైమ్ కూడా అందిస్తోంది. ఇక వాయిస్ కాల్స్ కు నిమిషానికి 25 పైసల ఛార్జీ మాత్రమే పడుతుందని చెప్పింది. ఈ ఆఫర్‌తో పాటు మరికొన్ని ఆఫర్లను కూడా అందిస్తున్నామని, 54 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1జీబీ 4జీ డేటాను 28 రోజుల వరకు అందుకోవచ్చని తెలిపింది. ఇక రిలయన్స్ టూ రిలయన్స్ కాల్స్ కు నిమిషానికి 10 పైసలు, ఇతర లోకల్, ఎస్టీడీ కాల్స్ కు నిమిషానికి 25 పైసలు మాత్రమే ఛార్జీ పడుతుందని చెప్పింది. మరో ప్లాన్ 61 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1జీబీ 4జీ డేటాను నెల రోజులు అందుకోవచ్చని, రిలయన్స్ టూ రిలయన్స్ కాల్స్ కు ఆరు సెకన్లకు 1 పైసా, లోకల్, ఎస్టీడీ కాల్స్ కు రెండు సెకన్లకు 1 పైసా మాత్రమే వసూలు అవుతుందని చెప్పింది.