: ఎయిర్‌టెల్ పై రిలయన్స్ జియో తీవ్ర ఆరోపణలు


టెలికాం మార్కెట్లో రిల‌య‌న్స్ జియో కురిపిస్తోన్న ఆఫ‌ర్ల జోరుని త‌ట్టుకొని నిల‌బ‌డ‌డానికి మిగ‌తా కంపెనీలు కూడా ప్ర‌తిరోజు 1 జీబీ డేటా ఫ్రీ అంటూ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, ఇటువంటి ఆఫ‌రే గుప్పించిన ఎయిర్‌టెల్‌పై జియో ప‌లు ఆరోప‌ణ‌లు చేసింది. టారిఫ్ రూల్స్ ను ఉల్లంఘిస్తూ ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌ను తప్పుదోవ పట్టిస్తోంద‌ని తెలిపింది. తన కస్టమర్ల మధ్య ఏకపక్ష వివక్షను తీసుకొస్తుందని చెప్పింది. ఎయిర్ టెల్ అందిస్తోన్న‌ రూ.293, రూ.449 ప్లాన్స్ తప్పుడు ధోరణిలో ఉన్నాయని తెలిపింది. క‌స్ట‌మ‌ర్ల‌ను ఆకర్షించడానికి ఆ రీచార్జీల‌తో 70 రోజుల వరకు రోజుకు 1జీబీ డేటాను అందిస్తున్నట్టు ఎయిర్‌టెల్‌ చెప్పిందని, అయితే, కేవలం 50ఎంబీ డేటాను మాత్రమే అందిస్తుందని జియో ఫిర్యాదు చేసింది.

మిగ‌తా డేటా వాడుకుంటే ఛార్జీలు వేస్తోంద‌ని మండిప‌డింది. దీంతో ఎయిర్ టెల్‌పై కస్ట‌మ‌ర్లు అసంతృప్తితో ఉన్నార‌ని, ఆ సంస్థ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, జ‌రిమానా విధించాల‌ని డిమాండ్ చేసింది. ఎయిర్ టెల్ పాల్ప‌డుతున్న ఈ చ‌ర్య‌ టారిఫ్ ఆర్డర్ 1999కు ఉల్లంఘనే అని జియో స్ప‌ష్టం చేస్తోంది. అయితే, ఎయిర్ టెల్ మాత్రం ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తోంది.

  • Loading...

More Telugu News