: ప్రభాస్ ను ఆటపట్టించిన రానా!
బాహుబలిని భల్లాలదేవ ఆట పట్టించాడు. ఆ కథలోకి వెళితే, నటుడు రానా ఓ టీవీ ఛానెల్ లైవ్ ఇంటర్వ్యూకు వెళ్లాడు. అక్కడి నుంచి ప్రభాస్ కు ఓ సరదా కాల్ చేశాడు. పోలీసులు తనను పట్టుకున్నారని, ఏదైనా హెల్ప్ చేయమని ప్రభాస్ ను కోరుతూ డ్రామా ఆడాడు. రానా చెప్పిందంతా విన్న ప్రభాస్, ‘బాహుబలి-2లో నా సహాయకుడిగా నిన్ను పెట్టుకుంటానని చెప్పేయ్, వదిలేస్తారు’ అని సలహా ఇచ్చాడు. దీంతో, తాను నాటకమాడుతూ, అతనిని ఆటపట్టిస్తున్నట్టు ప్రభాస్ పసిగట్టేశాడని రానాకు అర్థమైంది.