: ‘బాహుబలి’ చీరల్లో భీమవరం 'ప్రభాస్ లేడీ ఫ్యాన్స్'!
‘బాహుబలి’ మేనియా కొనసాగుతోంది. హీరో ప్రభాస్ సొంత జిల్లా పశ్చిమగోదావరిలో మహిళలు ‘బాహుబలి’ చీరలు ధరించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. భీమవరంలోని ప్రభాస్ లేడీ ఫ్యాన్స్ ‘బాహుబలి’ చీరలు ధరించి పట్టణంలో తిరుగుతున్నారు. కాగా, ఈ చీరలపై ప్రభాస్, అనుష్క బొమ్మలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రభాస్ లేడీ ఫ్యాన్స్ మాట్లాడుతూ, ప్రభాస్ భీమవరంలో పెరిగాడని, అతను నటించిన సినిమా ఇంత విజయం సాధించడం తమకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రం ఎన్నో అవార్డులు పొంది, ‘ఆస్కార్’ వరకు వెళ్లాలని కోరుకుంటున్నామని, రాజమౌళి, ప్రభాస్, కీరవాణిలు తమ జిల్లాకు చెందిన వారేనని, తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.