: పాకిస్థాన్‌లో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా విడుదలకు బ్రేక్!


కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘ట్యూబ్‌లైట్‌’ పాకిస్థాన్‌లో విడుద‌లయ్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. అందుకు కార‌ణం రంజాన్ రోజునే ఈ సినిమా విడుద‌ల అవుతుండ‌డం. ఆ పండుగ‌ ముస్లింల ప్రధాన పండుగ కాబట్టి ఆ రోజు త‌మ దేశ‌ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని పాకిస్థాన్‌ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ రోజున పాకిస్థానీ సినిమాలు రెండు విడుదల కానున్నాయి. ఆ సినిమాల‌ను మాత్ర‌మే పాక్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఇందుకోసం తాము త‌మ దేశ‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌కు లేఖ రాసి ఎన్‌ఓసీ జారీ చేసేలా చర్యలు తీసుకోవాల‌ని కోర‌నున్న‌ట్లు అక్క‌డి డిస్ట్రిబ్యూట‌ర్లు చెప్పారు.


  • Loading...

More Telugu News