: హ్యాట్సాఫ్ రాజమౌళి: దర్శకుడు శంకర్
భారీ బడ్జెట్‌తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 సినిమా పట్ల సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులో దిగ్గజ దర్శకుడు శంకర్ కూడా చేరారు. తాను బాహుబలి-2 ఇప్పుడే చూశానని, భారతీయ సినిమా పరిశ్రమ గర్వించతగ్గ సినిమా అని ఆయన అన్నారు. సినిమాలోని అన్ని అంశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని, దర్శకుడు రాజమౌళికి, ఈ సినిమా టీమ్‌కి హ్యాట్సాఫ్ అని శంకర్ కొనియాడారు. ఈ సినిమాపై రజనీకాంత్, కమలహాసన్, చిరంజీవి వంటి ఎందరో సినీ ప్రముఖులు ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అన్ని అంచనాలకు తగ్గట్లుగానే బాహుబలి-2 రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళుతోంది.
Just saw Bahubali 2 - The pride of Indian Cinema.What a Bravery,Beauty, Grandness & Music.. Awestruck.Hats off to 'Raja'mouli artsts n team.
— Shankar Shanmugham (@shankarshanmugh) 30 April 2017