: ‘చంద్రన్న బీమా’తో అందరికీ న్యాయం జరుగుతుందా?: టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల
గుంటూరులో నిర్వహించిన మే డే వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అసంతృప్తితో కూడిన ప్రసంగం చేశారు. చంద్రన్న బీమా పథకంతో అందరికీ న్యాయం జరుగుతుందా? అంటూ ప్రశ్నించిన మోదుగుల, కార్మికులు కాని వారే ఎక్కువగా బీమా పథకాన్ని వాడుకుంటున్నారని, గుంటూరు హోటళ్లలో బాలకార్మికులు పని చేస్తుంటే పట్టించుకునే వారే లేరని అన్నారు. మిరప తొడిమలు తీసే 25 వేల మందికి కార్మిక చట్టాలు వర్తించవా? అని ప్రశ్నించారు. భజరంగ్ జూట్ మిల్ లాకౌట్ తో 1500 మంది రోడ్డునపడ్డారని, జూట్ మిల్ కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మోదుగుల విమర్శించారు.