: రోజు రోజుకీ ఉబ్బిపోతున్న పసివాడి పొట్ట!


మూడు నెలల ఓ బాబుకి అంతుచిక్కని వ్యాధి సోకడంతో అత‌డి పొట్ట రోజురోజుకి పెరిగిపోతోంది. దీంతో ఆ బాలుడి త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. విశాఖప‌ట్నం జిల్లాలోని పాడేరులోని మారుమూల గ్రామమైన కుంకంపూడికి చెందిన గెమ్మెలి బాలరాజు, లక్ష్మి దంపతులకు ఆరు నెలల కిందట ఓ మగబిడ్డ జ‌న్మించాడు. మూడు నెల‌లుగా ఆ బాలుడి పొట్ట ఉబ్బిపోతూ వ‌స్తోంది. ఆ బాలుడు పాలు తాగినా, తాగకపోయినా ఇదే ప‌రిస్థితి.

 పేదరికంతో ఇల్లు గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా ఉన్న ఆ దంప‌తుల‌కి త‌మ బిడ్డ‌కు వైద్యం చేయించే స్తోమత లేక తల్లడిల్లిపోతున్నారు. ఇటీవల తమ కుమారుడిని చింతపల్లి సీహెచ్‌సీకి తీసుకెళ్లామని, అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తమ బాబును తరలించారని, తమ బాబుకి ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు చెప్పారని అన్నారు. అయితే, రెండు రోజులపాటు చిన్నారిని ఆస్పత్రిలో ఉంచి, ఆ తరువాత వైద్య సిబ్బంది పట్టించుకోలేదని అన్నారు. దీంతో తమ బాబుని ఇంటికి తీసుకొచ్చేశామని అన్నారు. ఇప్ప‌టికే ఆ ఆరునెల‌ల బాబు పొట్ట 28 సెంటీమీటర్లు పెరిగిపోయింది.

  • Loading...

More Telugu News