: కదులుతున్న రైలు నుంచి ప్రయాణికుడిని తోసేసిన టీటీ
కదులుతున్న రైలు నుంచి ప్రయాణికుడిని టీటీ తోసేసిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... తిరుపతి నుంచి కడప జిల్లా ముద్దనూరు మీదుగా వెళ్తున్న ట్రైన్ లోకి గిరిప్రసాద్ అనే ప్రయాణికుడు ఎక్కాడు. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఏదో విషయమై టీటీతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం రైలు కదలడంతో ఇద్దరూ రైలెక్కారు. మార్గ మధ్యంలో మరోసారి విరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన టీటీ రైలు కడప జిల్లా ముద్దనూరు మండలంలోని ఓబులాపురం దగ్గరకు చేరుకునే సరికి కదులుతున్న ట్రైన్ లోంచి గిరిప్రసాద్ ను బయటకు తోసేశాడు. దీంతో కిందపడ్డ గిరిప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. టీటీ వివరాలు తెలియరాలేదు. దీనిపై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.