: నా భార్య మెలానియా ట్రంప్‌ను మీడియా టార్గెట్ చేసి దూషిస్తోంది: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పదవి తన కుటుంబానికి భారమేనని అన్నారు. తాను అమెరికా అధ్యక్షుడి పదవిలో ఉన్నప్పటికీ మీడియా మాత్రం తనను చిన్న చూపు చూస్తూ పలు కథనాలు ప్రచురిస్తోందని, తన భార్య మెలానియా ట్రంప్‌ను మీడియా లక్ష్యంగా చేసి దూషిస్తోందని అన్నారు. మీడియాపై ఈ సందర్భంగా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. మీడియాకు వైఫల్య గ్రేడ్ ఇవ్వాలని ఆయన నిన్న నిర్వహించిన ఓ సభలో పేర్కొన్నారు.