: తన ఫేవరెట్ కోహ్లీని తానే అవుట్ చేయాలని ఉందన్న కింగ్స్ ఎలెవన్ సందీప్


తన ఫేవరెట్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ వికెట్ ను తానే తీయాలని ఉందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యువ ఆటగాడు సందీప్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ జట్టు మరో 5 మ్యాచ్ లు ఆడనుండగా, కనీసం మూడు మ్యాచ్ లు గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరుతుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సందీప్, తమ తదుపరి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడాల్సి వుందన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

టీమ్ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్, సహచర ప్లేయర్ ఆమ్లా ఇస్తున్న విలువైన సలహాలు తాను రాణించేందుకు సహకరించాయని అన్నాడు. కాగా, పంజాబ్ పై తాజా మ్యాచ్ లో రాణించిన సందీప్, నాలుగు ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News