: మమతా బెనర్జీ స్త్రీనా? లేక పురుషుడా?: బీజేపీ నేత తీవ్ర సంచలన వ్యాఖ్యలు


పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ రాష్ట్ర ప్యానెల్ సభ్యుడు శ్యామపాద మండల్ చేసిన తీవ్ర సంచలన వ్యాఖ్యలు పెను కలకలం రేపుతున్నాయి. పశ్చిమ మిడ్నాపూర్‌ లో జరిగిన బీజేపీ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, మమతా బెనర్జీ నపుంసకురాలు అని ఎద్దేవా చేశారు. ముస్లింలు వారి మత సంప్రదాయల్లో భాగంగా ఎలా చేస్తారో అలాంటి పనులే మమత చేస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మమతా బెనర్జీ అసలు స్త్రీనా? లేక పురుషుడా? అన్న విషయం తమకు అర్ధం కావడం లేదని ఆయన సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ఆమె ఒక హిజ్రా అని తాను చెప్పగలనని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆరోపణలు, పెద్ద పెద్ద తప్పులతో తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని బీజేపీ భావిస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. 

  • Loading...

More Telugu News