: దిగ్విజయ్ సింగ్ సంచలన ట్వీట్... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్!


కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు నకిలీ ఐఎస్ఐఎస్ వెబ్‌ సైట్‌ తయారుచేసి యువతను రెచ్చగొడుతున్నారని, యువతను రెచ్చగొట్టాలని పోలీసులకు కేటీఆర్‌ అధికారం ఇచ్చారా? అలా అయితే కేటీఆర్‌ దానికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అంటూ దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు.




దీనిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తి బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సూచించారు. సమాజంలో నేరాలు తగ్గించేందుకు కృషి చేస్తున్న పోలీసుల నైతికతను ప్రశ్నించే అర్హత దిగ్విజయ్‌ సింగ్ కు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ట్వీట్లు వారి అభిమానులను అలరిస్తున్నాయి.



 

  • Loading...

More Telugu News