: సుస్మితా సేన్ కోసం ఆత్మహత్య చేసుకోవాలనున్నాను: బాలీవుడ్ దర్శకుడు విక్రమ్‌ భట్‌


మాజీ విశ్వసుందరి, సినీ నటి సుస్మితా సేన్‌ కోసం ఆత్మహత్య చేసుకుందామని భావించానని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్‌ భట్‌ తెలిపాడు. రాజ్ రీబూట్ తో ఆశించిన ఫలితం సాధించలేకపోయిన విక్రమ్ భట్ ఆ తర్వాత రచయిత అవతారమెత్తాడు. ఈ నేపథ్యంలో తన గత జీవితం గురించి మాట్లాడుతూ, భార్యతో విడిపోయాక సుస్మితా సేన్, తాను ప్రేమించుకున్నామని అన్నాడు. తమ బంధం కూడా ఎక్కువ కాలం సాగలేదని, ఆమెతో కూడా బ్రేకప్ అయిందని తెలిపాడు. తమ బంధం బద్దలయ్యేనాటికి ‘గులాం’ సినిమా విడుదల కావాల్సి ఉందని అన్నాడు.

తన భార్యతో విడాకుల వల్ల తన కుమార్తెను బాగా మిస్సయ్యేవాడినని, అలాగే సుస్మితతో బ్రేకప్ ఆలోచనలు తనను కుదురుగా ఉండనిచ్చేవి కాదని, దీంతో ఆ బాధల నుంచి విముక్తి పేరుతో ఆత్మహత్య చేసుకుందామని భావించానని అన్నాడు. అయితే తన భార్య అదితిని బాధపెట్టి, పిల్లల్ని వదిలేసినందుకు చాలా బాధపడుతున్నానని విక్రమ్ భట్ తెలిపాడు. అయితే జీవితంలో మనం చేసే ప్రతి పని మనకి పాఠం నేర్పుతుందని విక్రమ్ భట్ తెలిపాడు. 

  • Loading...

More Telugu News