: తలైవా పొగడ్తలతో ఉబ్బితబ్బిబ్బవుతున్న రాజమౌళి


కోట్లాది మంది అభిమానులు 'తలైవా' అని ముద్దుగా పిలుచుకునే సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి వచ్చిన పొగడ్తలతో దర్శక దిగ్గజం రాజమౌళి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. రాజమౌళికి అభినందనలు చెబుతూ, ఆయన్ను దేవుడి బిడ్డగా, రజనీకాంత్ అభివర్ణించగా, రాజమౌళి కూడా తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు.

"తలైవా... నన్ను దేవుడే స్వయంగా ఆశీర్వదించినట్టుగా ఉంది. మా టీమంతా ఇప్పుడు ఆనందంలో తేలియాడుతోంది. మరే అభినందనా ఇంతకంటే గొప్పగా ఉండబోదు" అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీలను ఉంచారు. ఆపై ప్రియాంకాచోప్రా పంపిన అభినందనలపై కూడా రాజమౌళి స్పందించారు. "చాలా కృతజ్ఞతలు ప్రియాంకా... నువ్వీ చిత్రాన్ని చూసి ఆనందించినందుకు ఆనందం" అని అన్నారు.

  • Loading...

More Telugu News