: రాజమౌళి దేవుడిచ్చిన వరం: రజనీకాంత్


బాహుబలి చిత్రాన్ని వీక్షించిన సూపర్ స్టార్ రజనీకాంత్, రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ చిత్రం మొత్తం భారతావనికే గర్వకారణమని అన్నారు. రాజమౌళిని చిత్ర పరిశ్రమకు దేవుడిచ్చిన వరంగా పేర్కొంటూ ఆయనకు సెల్యూట్ చేస్తున్నట్టు తెలిపారు. రాజమౌళికి, అతని టీమ్ కు అభినందనలు తెలిపారు. కాగా, ఈ చిత్రం భారత చిత్రసీమలో కనీవినీ ఎరుగని విధంగా రికార్డులను తిరగరాస్తున్న సంగతి తెలిసిందే. హిందీ డబ్బింగ్ వర్షన్ సైతం, ఆల్ టైం రికార్డును సృష్టించిన అమీర్ ఖాన్ 'దంగల్'ను మించిన కలెక్షన్స్ ను సాధిస్తుందని అంచనా.

  • Loading...

More Telugu News