: దినకరన్ స్థానంలో అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధానకార్యదర్శిగా ఇళవరసి కుమారుడు వివేక్!
ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే శశికళ, పన్నీర్ వర్గంగా చీలిపోయింది. దీంతో పార్టీ గుర్తు అయిన రెండాకులు పన్నీర్ వర్గానికి వెళ్లిపోకుండా, తమకే దక్కేలా ఎన్నికల అధికారులను ప్రలోభ పెట్టేందుకు దినకరన్ పెద్దమొత్తంలో డీల్‌కు సిద్ధమై అడ్డంగా బుక్కయ్యారు.
ప్రస్తుతం ఆయన కోర్టు ఆదేశాల మేర ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల అదుపులో ఉన్నారు. దీంతో ఆ స్థానంలో శశికళ వదిన ఇళవరసి కుమారుడు వివేక్‌ను నియమించేందుకు ప్రయత్నాలు ముమ్మరమైనట్టు తెలుస్తోంది. వివేక్‌ను వీలైనంత త్వరగా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించాలని పార్టీలోని ఓ వర్గం జోరుగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.