: ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై దాడి!
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సినీ నటుడు మనోజ్ తివారీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేయడం కలకలం రేపుతోంది. మనోజ్ తివారీ ఇంట్లో లేని సమయంలో ఆయన ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు సోదాలు నిర్వహించారు. దీనిపై మండిపడ్డ మనోజ్ తివారీ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్ తివారీ మాట్లాడుతూ, ఈ దాడుల వెనుక పోలీసుల పాత్ర ఉందని ఆరోపించారు. కుట్రపూరితంగా తన నివాసంపై దాడులు చేశారని ఆయన మండిపడ్డారు.