: చాలా స్వల్పంగా పెరిగిన పెట్రో ధరలు.. నేటి నుంచి అమలు


నేటి (సోమవారం) నుంచి పెట్రో ధరలను స్వల్పంగా పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల్లో మార్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలుపై లీటరకు పైసా, డీజిల్‌పై 44 పైసలు పెంచినట్టు పేర్కొంది. దేశంలోని మిగతా నగరాల్లోనూ ధరలు పెరుగుతాయని తెలిపింది.

గత నెల 16న పెట్రోలుపై లీటరుకు రూ.1.39, డీజిల్‌పై రూ.1.04 పెరిగిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం చెన్నైలో లీటర్ పెట్రోలు ధర రూ.71.17, ముంబైలో రూ.77.46 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల్లో సంభవిస్తున్న మార్పుల కారణంగా జంషెడ్‌పూర్, పాండిచ్చేరి, విశాఖపట్టణం, చండీగఢ్, ఉదయ్‌పూర్ తదితర నగరాల్లో పెట్రో ధరల్లో రోజువారీ మార్పులు ఉంటాయని ఐవోసీఎల్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News