: చెట్టు మీద పిల్లి... పిల్లి చేతిలో తుపాకి... బెంబేలెత్తిపోయిన జనం!
చెట్టెక్కి కూర్చున్న పిల్లిని చూసి బెంబేతెల్తిపోయి పరుగులు పెట్టిన ఘటన అమెరికాలోని ఒరెగాన్ స్టేట్ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... మనదేశంలో పిల్లిని చూస్తే అపశకునంగా భావిస్తాం. కానీ.. విదేశాల్లో మాత్రం పిల్లుల్ని ముద్దుగా పెంచుకుంటుంటారు. అలాగే ఒక పెద్ద పెంపుడు పిల్లి తన నివాసానికి దగ్గర్లోని చెట్టెక్కి, ఒక కొమ్మను పట్టుకుని కూర్చుంది. దీనిని చూసిన జనాలు పరుగందుకున్నారు. అంతే కాదు... కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇలా బెంబేలెత్తిపోయిన వారిలో ఒకరు ఆ పిల్లి తుపాకీ పట్టుకున్న ఫోటోను సెల్ ఫోన్ లో బంధించి, పోలీసులకు పంపారు. దీనిని పరీక్షగా చూసిన పోలీసులు, భయపడాల్సిందేమీ లేదని, పిల్లి పట్టుకున్నది తుపాకీ కాదని, చెట్టు కొమ్మను పట్టుకుందని, అది తుపాకీ అన్న భ్రాంతి కలిగేలా ఉందని వారు తెలిపారు. చెట్టుకొమ్మమీద ఆధారం లేకుండా కూర్చున్న పిల్లిని చూసి తమకు అనుమానం వచ్చిందని, పరీక్షగా చూడగా, అది పట్టుకున్నది తుపాకీ కాదని, చెట్టుకొమ్మ అని అర్ధమైందని వారు తెలిపారు. దీంతో అక్కడి వారు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.