: అమెరికా ఓడకు జపాన్ యుద్ధ నౌక రక్షణ!


అమెరికా నౌకకు రక్షణగా జపాన్ యుధ్ధనౌకను రంగంలోకి దించడం ఆసక్తి రేపుతోంది. ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ యుద్ధకాంక్షతో రగిలిపోతున్న నేపథ్యంలో జపాన్ ఆచితూచి అడుగేస్తోంది. కిమ్ జాంగ్ ఉన్ దక్షిణ కొరియా తరువాత తీవ్రంగా వ్యతిరేకించేది జపాన్ నే! దక్షిణ కొరియాకు అండగా అమెరికా నిలిచిన నేపథ్యంలో జపాన్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

ఈ నేపథ్యంలో ఫసిఫిక్ మహాసముద్రంలో లంగరేసి ఉన్న అమెరికాకు చెందిన సరఫరా నౌకకు రక్షణగా జపాన్‌ కు చెందిన భారీ యుద్ధనౌక ఇజుమో అనే హెలికాప్టర్ వాహకనౌక రంగంలోకి దిగనుంది. ఈ యుద్ధ నౌక యోకోసుకా రేవు నుంచి పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రంలో వెళ్తున్న అమెరికా సరఫరా నౌకకు రక్షణ కల్పించనుంది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత యుద్ధ విన్యాసాలకు వెలుపల జపాన్‌ చేపట్టిన తొలి మోహరింపు ఇదే కావడం విశేషం. 

  • Loading...

More Telugu News