: విశాఖ బీచ్‌లో స్కూలు బస్సు బీభత్సం.. అడిషనల్ ఎస్పీ తండ్రి మృతి.. ఏఎస్పీకి గాయాలు
విశాఖపట్టణంలో బీచ్‌లో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. నోవాటెల్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా బీచ్‌లో సేదతీరుతున్న వారిపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ కిశోర్ తండ్రి ధర్మారావు మృతి చెందగా, ఏఎస్పీ కిశోర్ సహా ఇద్దరు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. బ్రేక్‌లు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం సంభవించినట్టు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏఎస్పీ కిశోర్ కుటుంబ సభ్యులను మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు పరామర్శించారు.