: గ్యాంగ్‌స్టర్ నయీం పోలీస్ ఇన్ఫార్మర్.. మాజీ ఏసీపీ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు


గతేడాది పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం పోలీస్ ఇన్ఫార్మర్ అని మాజీ ఏసీపీ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా పోలీసులు చేపట్టిన  పలు కార్యక్రమాలకు ఇన్ఫార్మర్‌గా నయీం సహకారం అందించాడని పేర్కొన్నారు. ఓ కేసులో భాగంగా డిఫెన్స్ కౌన్సిల్ ప్రశ్నించినప్పుడు శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

నయీంతో కలిసి ఉన్న శ్రీనివాస్ ఫొటో ఒకటి పత్రికల్లో ప్రచురితం కావడంపై శ్రీనివాస్‌ను కౌన్సిల్ ప్రచురించింది. అయితే అది మార్ఫింగ్ ఫొటో అని పేర్కొన్న ఆయన తాను భువనగిరి సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు నయీం, అతడి కుటుంబ సభ్యులు తనకు తెలుసన్నారు. నయీం పోలీస్ ఇన్ఫార్మర్‌గా వ్యవహరించేవాడని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News