: ‘బాహుబలి-2’ దండగ సినిమా: బాలీవుడ్ నటుడు కేఆర్కే తీవ్ర వ్యాఖ్యలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) తన వ్యాఖ్యల ద్వారా వార్తల్లోకి ఎక్కడం తెలిసిందే. తాజాగా, దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ‘బాహుబలి-2’ చిత్రంపై తన దైన శైలిలో సమీక్ష చేశాడు. ఈ చిత్రంలో అసలు కథే లేదని, ఈ సినిమా చూడటం దండగ అని, సమయాన్ని వృథా చేసుకోవద్దని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
అంతేకాకుండా, ఈ సినిమాలో ప్రభాస్ ఒంటెలా ఉన్నాడని, ప్రభాస్ తో సినిమా తీయాలని బాలీవుడ్ దర్శకులెవరైనా అనుకుంటే వాళ్లు నిజంగా తెలివతక్కువ వాళ్లేనని వ్యాఖ్యానించాడు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ఘోరంగా ఉన్నాయని, మూడు గంటల పాటు తీయాల్సిన కథా వస్తువు ఈ చిత్రంలో లేదని, చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్ లా ‘బాహుబలి-2’ ఉందని అనుచిత వ్యాఖ్యలు చేశాడు.