: జీవితాంతం గుర్తుండిపోయే గొప్ప విజయాన్ని అందించారు: రాజమౌళి


రెండు రోజుల క్రితం విడుదలైన ‘బాహుబలి-2’ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రంతో తెలుగు సినిమా కీర్తిని అంతర్జాతీయ స్థాయికి దర్శకుడు రాజమౌళి తీసుకువెళ్లారంటూ సినీ ప్రముఖులే కాక ఇతర రంగాలకు చెందిన వారు కూడా కితాబునిస్తున్నారు. ముఖ్యంగా,‘బాహుబలి’ చిత్రం మొదలు పెట్టినప్పటి నుంచి నేటి వరకు అభిమానుల నుంచి లభిస్తున్న మద్దతు అంతా ఇంతాకాదు.

ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఆయా ట్వీట్లలో రాజమౌళి ఏమన్నారంటే..‘ ‘బాహుబలి’ లాంటి బిగ్ ప్రాజెక్ట్ చిత్రాల విడుదల సమయంలో ఆటంకాలు కలగడం సహజమే. అయితే, మా చిత్ర యూనిట్ పై ఎంతో ప్రేమ చూపి, మద్దతు ఇచ్చిన బాహుబలి ఫ్యాన్స్ కారణంగానే వాటిని అధగమించగలిగాము. ఐదేళ్ల పాటు మా వెన్నంటి ఉండి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. మా జీవితాంతం గుర్తుండి పోయే ఘన విజయాన్ని అందించిన మీ అందరికీ నా కృతఙ్ఞతలు’ అని రాజమౌళి తన సంతోషం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News