: మా మాట మేం చెప్పాం... ఇక చంద్రబాబు ఇష్టం: భేటీ అనంతరం శిల్పా మోహన్ రెడ్డి
చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ ఉదయం ఆయన్ను కలిసిన శిల్పా సోదరులు మోహన్ రెడ్డి, చక్రపాణిరెడ్డిలు నంద్యాల అసెంబ్లీ సీటు విషయమై ఆయనతో చర్చించారు. దాదాపు 20 నిమిషాల పాటు సమావేశమైన వీరు, అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. నంద్యాల సీటు విషయంలో తమ అభిప్రాయాలను చంద్రబాబుకు స్పష్టంగా వివరించామని శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. ఎవరిని పోటీకి నిలపాలన్న నిర్ణయాధికారం చంద్రబాబుదేనని తెలిపారు. తమకు సీటు ఇవ్వాలా? వద్దా? అన్నది సీఎం నిర్ణయిస్తారని, తమకు అన్యాయం జరగబోదని భావిస్తున్నామని, చంద్రబాబు నోటి నుంచి ఎవరి పేరు వచ్చినా సమ్మతమేనని అన్నారు. భూమా వర్గం కూడా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు సాగిస్తోందని చెప్పారు.