: జయహో రాజమౌళి... హ్యాట్సాఫ్: మెగాస్టార్ చిరంజీవి


విజువల్ వండర్, రాజమౌళి సృష్టించిన వెండితెర అద్భుతం 'బాహుబలి: ది కన్ క్లూజన్'ను పొగడ్తల్లో ముంచెత్తిన ప్రముఖుల్లో మెగాస్టార్ చిరంజీవీ చేరిపోయారు. ఈ చిత్రాన్ని చూసిన చిరంజీవి స్పందిస్తూ, "జయహో రాజమౌళి. బాహుబలి ఒక అద్భుతం. ఇంతటి అద్భుతాన్ని సృష్టించిన రాజమౌళి అభినందనీయుడు. తెలుగు సత్తాను దేశ విదేశాల్లో చాటిన అద్భుత శిల్పికి హ్యాట్సాఫ్. సినిమాలో భాగమైన ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, నాజర్ లకు నా అభినందనలు" అని చిరంజీవి వ్యాఖ్యానించారు. తెరవెనుక ఉన్న విజయేంద్ర ప్రసాద్, కీరవాణి, సెంథిల్ కుమార్, టెక్నికల్ నిపుణులు పడ్డ శ్రమ చిత్రంలో తనకు కనిపించిందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News