: రాజమౌళి తదుపరి సినిమా హీరో అల్లు అర్జున్?


తన బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకున్న దర్శక దిగ్గజం రాజమౌళి తదుపరి చిత్రం ఏంటి? ఇప్పటికే ఆయన మహాభారతం చిత్రం ఇప్పట్లో ఉండబోదని స్పష్టం చేయగా, ఆయన ఏం సినిమా మొదలు పెడతారోనన్న విషయమై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కొత్త వార్త ఏంటంటే, చాలా రోజుల క్రితమే ఓ సినిమా చేస్తానని నిర్మాత డీవీవీ దానయ్య నుంచి అడ్వాన్స్ తీసుకున్న రాజమౌళి, ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారని, ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'డీజే' సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్, ఆపై లింగుస్వామితో సినిమాకు ఓకే చెప్పాడు. ఈ సమయంలో రాజమౌళి లైన్ లోకి వస్తే, దాన్ని పక్కన పెట్టేసి, ఈ చిత్రానికి ఓకే చెప్పేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం వెలువడనప్పటికీ, అల్లు అర్జున్ అభిమానులు మాత్రం అప్పుడే తమ హీరోకు మరో బంపర్ హిట్ దొరికినంత ఖుషీగా ఫీలైపోతున్నారు.

  • Loading...

More Telugu News