: ముందస్తు ఎన్నికలు ఊహాగానమే: స్పష్టం చేసిన వెంకయ్యనాయుడు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందస్తు ఎన్నికలు రావచ్చంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనని, వాటిల్లో ఎంతమాత్రమూ వాస్తవం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఏ రాష్ట్రానికీ ముందుగానే ఎన్నికలు వస్తాయని తాను భావించడం లేదని, ఏక కాలంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరపాలన్న ఆలోచన అమల్లోకి రావడానికి ఎంతో కాలం పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి అమల్లోకి రానున్న స్థిరాస్తి నియంత్రణ చట్టాన్ని ప్రస్తావిస్తూ, నిర్మాణ రంగంలో ఇకపై కొనుగోలుదారుడే రారాజని వ్యాఖ్యానించారు. సొంత ఇంటి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పారు. కొత్త చట్టం ద్వారా స్థిరాస్తి, గృహ నిర్మాణ రంగాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్టు తెలిపారు. నవీన భారతావని నిర్మాణం కోసం ప్రతిపక్షాలు కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దర్శకుడు కే విశ్వనాథ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.

  • Loading...

More Telugu News