: చూస్తున్నారుగా... ఇక గంభీర్ ను టీమ్ లోకి తీసుకోండి: గంటగంటకూ పెరుగుతున్న డిమాండ్
ప్రస్తుత ఐపీఎల్ సీజనులో భారత క్రికెట్ జట్టులోని దాదాపు అందరు ఆటగాళ్లూ ఆడుతుండగా, అత్యధిక పరుగులు చేసింది మాత్రం జట్టులో స్థానం లేని గౌతమ్ గంభీర్. కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఇప్పటివరకూ 9 మ్యాచ్ లు ఆడిన గంభీర్, 376 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతుండగా, భారత క్రికెట్ జట్టులోకి అతన్ని తిరిగి తీసుకోవాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది. 'బ్రింగ్ బ్యాక్ జీజీ' అంటూ ఓ హ్యాష్ టాగ్ హల్ చల్ చేస్తుండగా, దానికి లైకుల సంఖ్య వందల నుంచి వేలు దాటి, లక్షల్లోకి చేరింది. త్వరలో ఇంగ్లండులో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో గంభీర్ ను తీసుకోవాలని ఆయన అభిమానులు బలంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.