: ట్రంప్ వద్దంటున్నా వినకుండా ఉత్తరకొరియా క్షిపణి పరీక్ష... ఘోరంగా విఫలం!


ఉత్తర కొరియా దూకుడుకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని అన్ని మార్గాల్లో ప్రయత్నాలు సాగిస్తూ, క్షిపణి పరీక్షలను నిలిపివేయాలని చైనా అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్ తో చెప్పించినా, నియంత కిమ్ జాంగ్ ఉన్ వినలేదు. దౌత్య, సైనిక పరంగా, అంతర్జాతీయంగా ఉత్తర కొరియాపై ఒత్తిడి తెచ్చే వ్యూహంతో అమెరికా అడుగులు వేస్తుండగా, ఈ తెల్లవారుజామున ఉత్తర కొరియా ప్రయోగించిన ఓ క్షిపణి లక్ష్యాన్ని చేరకుండా మార్గమధ్యంలో పేలిపోయింది. ఖండాంతర క్షిపణిని పరీక్షకు నిలుపగా, గాల్లోకి లేచిన క్షణాల్లోనే అది పేలిపోయి ఘోరంగా విఫలం చెందింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, యూఎస్ సైనిక వర్గాలు ధ్రువీకరించాయి. నార్త్ కొరియా చేపట్టిన మరో క్షిపణి ప్రయోగం విఫలమైందని అధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News