: నోట్లు చిరిగినా, రంగు పడినా తీసుకోండి... కరెన్సీ నోట్లపై ఆర్బీఐ తాజా ఆదేశాలు!
కొత్తగా భారత్ లో విడుదలైన కరెన్సీ నోట్లు చిరిగినా, రంగు పడినా బ్యాంకులు స్వీకరించడం లేదని వస్తున్న ఫిర్యాదుల సంఖ్య అధికంగా ఉండటంతో రిజర్వ్ బ్యాంక్ స్పందించింది. నోట్లు చిరిగినా, రంగు పడినా, రాతలున్నా తీసుకోవాల్సిందేనని, లేకుంటే చట్ట విరుద్ధంగా ప్రవర్తించినట్టేనని చెబుతూ, అన్ని బ్యాంకులకూ ఆదేశాలు జారీ చేసింది.
కాగా, కొత్త నోట్లు విడుదలైన వేళ, వీటిపై రాతలు రాయరాదని, చిరిగితే తీసుకోబోమని బ్యాంకులు వెల్లడించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇటీవలి కాలంలో వందల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ తన తాజా ఆదేశాల్లో భాగంగా సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మరాదని, పది రూపాయల నాణాలు సైతం చెల్లుతాయని మరోసారి స్పష్టం చేసింది.