: బాహుబలిలో ఆ సీన్ కు పవన్ కల్యాణ్ స్ఫూర్తి: రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్


వెండి తెరపై కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న "బాహుబలి: ది కన్ క్లూజన్" గురించి ఓ పత్రికతో మాట్లాడుతూ, కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఈ సినిమా విశ్రాంతి ముందు వచ్చే సన్నివేశానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు స్ఫూర్తి అని వెల్లడించారు.

భల్లాల దేవుడికి పట్టాభిషేకం జరిగినా, అతను తృప్తిగా ఉండలేడని, బాహుబలికే ప్రజామద్దతు ఉందని, అతనికే ప్రజలు నీరాజనాలు పలుకుతుంటారని, ఓ కాన్సెప్ట్ ను అనుకున్నామని, ఇక దీన్ని తెరపైకి ఎలా ఎక్కించాలా అని మధనపడుతున్న వేళ, అనుకోకుండా టీవీ పెడితే, ఓ ఆడియో ఫంక్షన్ వస్తోందని గుర్తు చేసుకున్నారు.

 ఆ ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ లేడని, కానీ పవన్ పేరు వినిపించినప్పుడల్లా, అభిమానులు వెర్రిగా ఊగిపోతూ, ఆపై ఐదు నిమిషాల పాటు ఎవరు ఏమి మాట్లాడినా వినిపించలేదని చెప్పారు. వేదికపై ఉన్న హీరోలంతా అసూయపడే ఆ పరిస్థితిని చూసి, ఇదేదో బాగుందని, వెంటనే విశ్రాంతి సన్నివేశాన్ని రాసుకున్నానని, ఆ విధంగా ఇంటర్వెల్ సీన్ కు పవన్ కల్యాణ్ స్ఫూర్తి అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

  • Loading...

More Telugu News