: పోలీసులు రెచ్చగొట్టారు... అమ్మాయిలమంతా రాళ్లు విసిరాం: కశ్మీర్ యువతి అఫ్షన్‌ ఆషికీ


కశ్మీర్‌లోని యువ‌త అక్క‌డి భద్రతా దళాలపై రాళ్లు విసురుతూ రెచ్చిపోతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే పాఠశాల, కళాశాల విద్యార్థినులు కూడా రాళ్లతో భద్రతాదళాలపై దాడి చేశారు. అయితే, ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఆ రాష్ట్ర యువ‌తి అప్ష‌న్ ఆషికీ ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. తాము భ‌ద్ర‌తా ద‌ళాల‌పై రాళ్లు రువ్వామ‌ని చెప్పింది. అయితే, భారత్‌తోనే తమ భవిష్యత్తు ముడిపడి ఉంద‌ని, దేశం తరఫున మహిళా ఫుట్‌బాల్‌ జట్టుకు ఆడాలన్నదే త‌న‌ ఆశయమ‌ని తెలిపింది. పోలీసులు త‌మ‌ను రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్లే తాము రాళ్లు రువ్వామ‌ని ఆమె వ్యాఖ్యానించింది. భ‌ద్ర‌తా ద‌ళాల‌పై దాడులు చేస్తూనే భార‌త్ త‌ర‌ఫున మ‌హిళ‌ల ఫుట్‌బాల్ టీమ్‌కు పాతినిధ్యం వ‌హిస్తాన‌ని, అదే త‌న ల‌క్ష్య‌మ‌ని ఆమె చెప్ప‌డం ప‌ట్ల అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News