: కట్టప్ప సంగ‌తి తెలిసిపోయింది.. రెండో ప్ర‌శ్న‌కు మాత్రం మీరే జ‌వాబు చెప్పగ‌లరు: ముంబయ్ ట్రాఫిక్ పోలీసుల ప్రశ్న


‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసి పోయింది.. కానీ మేము అడుగుతున్న రెండో ప్ర‌శ్న‌కు మాత్రం మీరే స‌మాధానం చెప్ప‌గ‌ల‌రు’ అంటూ ముంబ‌యి ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను వాహ‌న‌దారుల‌కు గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందుకు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకొని ఆస‌క్తిక‌ర‌మైన పోస్టు చేశారు. దీనిపై ఎంతో మంది యూజ‌ర్లు ర‌క‌ర‌కాలుగా స‌మాధానం ఇస్తున్నారు.

ఇక ఈ పోస్టులో ఉన్న రెండు ప్ర‌శ్న‌లు ఏంటంటే 1.‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’,  2. ‘ప్రజలు ట్రాఫిక్‌ నియమాలను ఎందుకు పాటించరు?’ మొద‌టి ప్ర‌శ్న‌కు త‌మ‌కు సమాధానం తెలిసిపోయిందని, ఇక‌ రెండో ప్రశ్నకు సమాధానం చెప్పండ‌ని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. వీటికి ఎన్నో సమాధానలు వచ్చాయి.. ఒక యూజర్ మాత్రం మళ్లీ ట్రాఫిక్ పోలీసులకే ప్రశ్న వేసింది. ‘ప్రభుత్వం సరిగ్గా ఎందుకు రోడ్లు వేయించబోదు’? ఈ ప్రశ్నకు సమాధానం చెబితే మీ ప్రశ్నకు సమాధానం చెబుతామని అడిగింది.





  • Loading...

More Telugu News