: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుకు విద్యాసాగర్‌రావు పేరు పెడతాం: సీఎం కేసీఆర్
ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు అనారోగ్య కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఓ సాగునీటి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలో ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఇరిగేషన్‌శాఖ అధికారుకు సూచించారు. ఆయన ‘నీళ్లు-నిజాలు’ పుస్తకంతో రాష్ట్ర ప్రజలకు సాగునీటిపై అవగాహన కల్పించారని, తెలంగాణ కోసం తపించారని అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని విద్యాసాగర్‌రావు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించారని కొనియాడారు.