: ఈవీఎం అంటే ‘ఎవ్రీ ఓట్ ఫర్ మోదీ’: యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు


ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో పాటు, ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నికల్లోనూ భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌య దుందుభి మోగించిన విష‌యం తెలిసిందే. అయితే, ప‌లు ప్ర‌తిప‌క్ష పార్టీల అధినేత‌లు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని బీజేపీపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఇటువంటి స‌మ‌యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

ఈ రోజు గోర‌ఖ్‌పూర్‌లో త‌మ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో ఆయ‌న స‌మావేశ‌మైన సంద‌ర్భంగా మాట్లాడుతూ... 'ఈవీఎం అంటే ఎవ్రీ ఓట్ ఫర్ మోదీ' అని వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల వెలువ‌డిన ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల ఫ‌లితాల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించడంపై యోగి స్పందిస్తూ.. ఢిల్లీ ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారని ఆయ‌న అన్నారు. అందుకే 'ఈవీఎం.. ఎవ్రీ ఓట్ మోదీ' విధానాన్ని అనుసరించారని ఆయ‌న అన్నారు.

మోదీ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నార‌ని, దేశంలో వీఐపీల సంప్రదాయానికి అడ్డుకట్ట వేశారని యోగి అన్నారు. భార‌త‌ చట్టాలపై గౌరవం లేనివాళ్లు, రౌడీలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆయ‌న ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. అది వారి మంచికోసమే చెబుతున్నాన‌ని ఆయ‌న అన్నారు. అలాగే త‌మ రాష్ట్ర‌ చట్టాల్లో, ప్రభుత్వ విధానాలలో ఎన్నో మార్పులు తీసుకురానున్న‌ట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News