: మై డార్లింగ్ వదిన సమంత పుట్టినరోజు పార్టీలో ఉన్నాను: అక్కినేని అఖిల్


చెన్నై బ్యూటీ, త‌నకు కాబోయే వ‌దిన స‌మంతతో అక్కినేని అఖిల్ సెల్ఫీ దిగాడు. నిన్న స‌మంత త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ని జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. త‌న‌ పుట్టినరోజు వేడుక‌కి అఖిల్‌ను స‌మంత ఆహ్వానించింది. ఆ పార్టీలో త‌న అన్న, వదిన‌ల‌తో హ్యాపీగా గ‌డిపిన అఖిల్ త‌న సంతోషాన్ని ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కు తెలిపాడు.

'న్యూయెస్ట్ అక్కినేని ఇన్ ది టౌన్.. మై డార్లింగ్ వదిన సమంత పుట్టినరోజు పార్టీలో ఉన్నాను... లవ్ యు’ అని ఆయ‌న అందులో పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెతో దిగిన సెల్ఫీల‌ను పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం స‌మంత, నాగచైత‌న్య‌, అఖిల్‌లు షూటింగుల్లో పాల్గొంటూ బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. స‌మంత పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వారంతా క‌లుసుకొని ఇలా ఎంజాయ్ చేశారు.

  • Loading...

More Telugu News