: ఏ లుచ్ఛాలు, లఫంగులు ఇప్పుడు పాలిస్తున్నారు?: ఉత్తమ్ కుమార్ ధ్వజం


ఏ లుచ్ఛాల పరిపాలలో తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతోంది? ఏ లఫంగులు తెలంగాణను పరిపాలిస్తున్నారు? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో మిర్చి రైతుకు లాఠీ ఛార్జీలు, పసుపు రైతుకు ఆత్మహత్యలే మిగిలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రతిపక్ష నేతలను తిట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి పరిమితమయ్యారని... ప్రజలకు, రైతులకు మేలు చేయడం ఆయనకు చేత కాదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ నేతలను తరిమి కొట్టడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు.

రెండు లక్షల బస్తాల మిర్చి ఖమ్మం మార్కెట్ యార్డులో ఉంటే ముఖ్యమంత్రి కనీసం స్పందించరా? అంటూ ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభలో ముందు రైతుల పంటకు మద్దతు ధర గురించి మాట్లాడిన తర్వాతే... భూసేకరణ బిల్లుపై ముందుకు వెళ్లాలని చెప్పారు.

  • Loading...

More Telugu News